: విశాఖలో మెట్రో రైలు నిర్మాణానికి సన్నాహాలు
విశాఖ, విజీటీఎం (విజయవాడ -గుంటూరు -తెనాలి -మంగళగిరి)లోనూ మెట్రో రైలు వస్తోంది. విశాఖలో మెట్రో రైలు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఎన్ పీవీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ మెట్రో రైలు తొలిదశలో భాగంగా 20 కి.మీ., వీజీటీఎంలో 49 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం నాలుగు కారిడార్లలో మెట్రో రైలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.