: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా సాగుతున్న పంద్రాగస్టు రిహార్సల్స్


దేశంలోని పలు ప్రాంతాల్లో పంద్రాగస్టు వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో జరిగిన ఈ రిహార్సల్స్ లో విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బెంగళూరులో పోలీసు సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించగా, కళాశాల విద్యార్థినులు సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో ఈ రిహార్సల్స్ లో పాల్గొన్నారు. చెన్నైలో 200 అడుగుల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో భారీ వర్షం కురుస్తున్నా పోలీసు సిబ్బంది రిహార్సల్స్ లో పాల్గొన్నారు. కోల్ కతా, గుర్గావ్, అజ్మీర్ (రాజస్థాన్), మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్), గౌహతి (అస్సాం)లో విద్యార్థులు, చిన్నారులు ప్రదర్శించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News