: జమ్మూకాశ్మీర్లో పంజా విసిరిన ఉగ్రవాదులు


జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి పాంపోర్ వద్ద ఉగ్రవాదులు పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ-శ్రీనగర్ పరిసరాలను జల్లెడ పడుతున్నాయి.

  • Loading...

More Telugu News