: ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
ఇటీవల దేశీయ విమానయాన రంగంలో ప్రవేశించిన ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ లోపు బుక్ చేసుకునే టిక్కెట్లపై 20 శాతం డిస్కౌంట్ ఇచ్చే పథకాన్ని సంస్థ ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబరు 14వ తేదీ వరకు ప్రయాణించే టిక్కెట్లపై ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఎయిర్ ఏషియా సర్వీసులు దేశంలో బెంగళూరు నుంచి చెన్నై, కొచ్చి, గోవా వరకు నడుస్తున్నాయి. త్వరలో బెంగళూరు నుంచి జైపూర్, చండీగఢ్ కూడా విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించింది.