: దళితులకు భూ పంపిణీ కార్యక్రమం దేశానికే ఆదర్శం: హరీశ్ రావు


తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న దళితులకు భూ పంపిణీ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, దాంతో పాటే తొలి ఏడాది పెట్టుబడి ఖర్చు ఇస్తామని ఆయన చెప్పారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ... దళితులకు భూపంపిణీ కార్యక్రమం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమై, ఐదేళ్ల పాటు కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతంతో కలిపి ఇంక్రిమెంట్ ఇస్తున్నామని హరీశ్ రావు అన్నారు. తండాల్లో పుట్టిన ఆడపిల్లల రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మరమగ్గం కార్మికులకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News