: కేసీఆర్ కు పొన్నాల 28 ప్రశ్నల లేఖాస్త్రం


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య 28 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 70 రోజుల పాలనను ఆయన లేఖలో ఎండగట్టారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడంలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క రోజులో సమగ్ర సర్వే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సర్వే చేయడం కోసం పనులు మానుకోవాలనడం సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. సమగ్ర సర్వే ఒక హంగామా డ్రామాగా ఆయన అభివర్ణించారు. ప్రజలకు ప్రత్యామ్నాయం కల్పించకుండా అందరూ ఇంట్లో ఉండాలని షరతులు పెట్టడం ప్రభుత్వ అవగాహనా రాహిత్యమని ఆయన పేర్కొన్నారు. మీడియాను నియంత్రించడం, పరిష్కారం వెతక్కుండా ఇతరులను తప్పు పట్టడం మంచి పద్ధతి కాదని పొన్నాల హితవు పలికారు.

  • Loading...

More Telugu News