: నాకు జీతం వద్దు... అంతా ప్రజా సంక్షేమానికే ఖర్చు చేస్తా: శ్రీధర్ రెడ్డి
ప్రజాప్రతినిధిగా ఐదేళ్లలో తనకు జీతంగా వచ్చే 60 లక్షల రూపాయలను ప్రజా సంక్షేమానికే ఉపయోగిస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలో తనకు వచ్చే జీతంతో పేద విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తానని అన్నారు. తాగునీటి పునరుద్ధరణకు ఖర్చు చేస్తానని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు ఆ డబ్బును ఉపయోగిస్తానని ఆయన తెలిపారు.