: ప్రతిరోజూ నడవండి లేదా సైకిళ్లు తొక్కండి!


ప్రజలను ప్రతిరోజూ నడవమని లేదా సైకిళ్లు వాడాలని ప్రభుత్వం సూచించింది. అయితే, చెప్పింది ఇక్కడ కాదు... చైనా రాజధాని బీజింగ్ లో. అక్కడ రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని చైనా ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనాలో పారిశ్రామికీకరణతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. బీజింగ్ లో 31 శాతం కాలుష్యం కేవలం వాహనాలు వదిలే కర్బన ఉద్గారాలతో ఏర్పడుతోందని కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు సైకిళ్లు వాడాలని ప్రభుత్వం చెబుతోంది.

  • Loading...

More Telugu News