: చిన్నారుల పట్ల సల్మాన్ ఖాన్ ఔదార్యం


నటుడు సల్మాన్ ఖాన్ ను అభిమానులు ప్రేమగా సల్లూ భాయ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఓ వైపు సూపర్ స్టార్ గా ఉంటూనే మరోవైపు ప్రజాహిత కార్యక్రమాలు చేయడంలో ఈ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా తన కొత్త చిత్రం 'కిక్'ను వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల కోసం బెంగళూరు, నోయిడా, ముంబయి మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేయించాడు. వారికి అర్ధమయ్యేందుకు సినిమా వస్తున్నప్పుడు కింద సబ్ టైటిల్స్ ను వేయించడంతో బాటు, సైగలతో వారికి వివరించేలా ఏర్పాటు కూడా చేయించాడు. ఈ విషయాన్ని సల్మానే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు.

  • Loading...

More Telugu News