: తిరుమల కొండెక్కడంలో రికార్డు కొట్టేసిన బుడ్డోడు


తిరుమల కొండ ఎక్కడంలో నాలుగేళ్ల పిల్లాడు రికార్డు సృష్టించాడు. కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతానికి చెందిన సత్య (4) కేవలం 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కాడు. తిరుమల నడకదారిలో యుక్త వయస్కులైతే రెండు నుంచి రెండున్నర గంటల్లో శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. కాస్త వయసు మీదపడ్డవారైతే నాలుగు గంటల సమయం పడుతుంది. శారీరక దారుఢ్యం బాగుంటే ఓ పావుగంట అటూ ఇటూగా కొండఎక్కే అవకాశం ఉంది. కాని సత్య మాత్రం కేవలం 40 నిమిషాల్లోనే కొండ ఎక్కేశాడు. దీంతో అధికారులు, భక్తులు అతడి వేగానికి, సామర్ధ్యానికి ఆశ్చర్యపోయారు. నాలుగేళ్ల పిల్లాడు రికార్డు స్థాయి సమయంలో కొండ అధిగమించడం అంటే స్వామివారి కృపే అంటూ శ్రీనివాసుని మహత్య్మాన్ని కొనియాడుతున్నారు. గత వారం రోజులుగా తిరుమలలో ఏదో ఒక వింత చోటుచేసుకోవడం వింటూనే ఉన్నాం.

  • Loading...

More Telugu News