: టీడీపీపై జగన్ బురద జల్లుతున్నారు: దేవినేని ఉమ
తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ బురద జల్లుతున్నారని టీడీపీ నేత, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... తాము హత్యా రాజకీయాలను ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించారని ఆయన అన్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలపై 23 కేసులు బనాయించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హత్యా రాజకీయాలను తాము ఉక్కుపాదంతో అణచివేస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు.