: మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రస్వామి రథో్త్సవం


కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మహో రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి 343వ ఆరాధనా మహోత్సవాలు ఐదు రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సంప్రదాయిక వాయిద్యాలు, వేలాది మంది భక్తుల నామస్మరణల మధ్య మంత్రాలయం పురవీధుల్లో మహారథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ... యోగనిద్రలో ఉన్న రాఘవేంద్రస్వామి భక్తుల కోసం గ్రామ వీధుల్లో సంచరిస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News