: ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి శిద్ధా


ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. రవాణా శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని శిద్ధా సూచించారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. అనంతరం టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ ను ఆయన పరిశీలించారు. మంత్రి వెంట ఆర్టీవో కృష్ణమోహనరావు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు కృష్ణారావు, రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News