: మల్టీ బ్రాండ్ రీటైల్ లో ఎఫ్ డీఐలను అనుమతించం: ఎన్డీఏ సర్కార్
దేశంలోని మల్టీ బ్రాండ్ రీటైల్ లో ఎఫ్ డీఐలను అనుమతించేది లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో బుధవారం క్వశ్చన్ అవర్ లో మాట్లాడిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, మల్టీ బ్రాండ్ రీటైల్ లో విదేశీ పెట్టుబడులను ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహించదని తేల్చి చెప్పారు. ఈ మేరకు తమ పార్టీ (బీజేపీ) మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి ఆదేశాన్ని ఇచ్చినట్లు తెలిపారు. కాగా, గత కొన్నేళ్ల నుంచి ఎఫ్ డీఐల ప్రవాహం స్థిరంగా లేదన్నారు. గత మూడు సంవత్సరాల్లో పెట్టుబడుల ప్రవాహం హెచ్చుతగ్గులుగా ఉందని పేర్కొన్నారు. 2012-13లో ఇవి 26.33 శాతం మేర తగ్గగా, 2013-14లో 6.12 శాతం పెరిగినట్లు మంత్రి వివరించారు.