: 'ఆకాశ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్ లోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్ నుంచి ఎయిర్ ఫోర్స్ ప్రయోగించిన 'ఆకాశ్' క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని బుధవారం ఉదయం 11 గంటల 42 నిమిషాలకు ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రయోగం పూర్తిగా సఫలమైందని ఐటీఆర్ డైరెక్టర్ ఎంవి కేవీ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రయోగం మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే జరిగిందని ఆయన చెప్పారు.