: ఆ మూవీ చూసి అమితాబ్ తల్లి గంటలకొద్దీ ఏడ్చిందట!


బాలీవుడ్ సినిమాకు పర్యాయపదంలా నిలిచిన నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన తన తల్లి తేజీ బచ్చన్ జన్మదినం సందర్భంగా ఓ అరుదైన ఘటనను తన బ్లాగులో పేర్కొన్నారు. తన హిట్ సినిమా 'దీవార్'ను చూసిన తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారట. ఆ సినిమాలో ఓ చిన్నారి చనిపోయే సీన్ ఆమెను కలచివేసిందని బిగ్ బి తెలిపారు. పాపం, ఆ చిన్నారి నిజంగానే చనిపోయిందని భావించి గంటలకొద్దీ పసిపాపలా విలపించిందని పేర్కొన్నారు. కాగా, కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు తల్లి ఎంతో ఆసరాగా నిలిచిందని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. ఒక్కోసారి తాను తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడు ఆమె తన చెంత కూర్చుని తల నిమురుతూ సముదాయించేదని చెప్పారు. భౌతికంగా లేకున్నా తల్లి ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అమితాబ్ తెలిపారు.

  • Loading...

More Telugu News