: ఎయిర్ పోర్టుల వద్ద పక్షుల బెడదకు సూపర్ చిట్కా!


టేకాఫ్ సమయంలో విమానాలకు ప్రథమ శత్రువులు పక్షులే. ఆ విహంగాలు ఎగురుతూ వచ్చి లోహ విహంగాల ఇంజిన్లలో చిక్కుకుపోయి ఎన్నో ప్రమాదాలకు కారణమవడం చూశాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలో ఓ చిట్కాను కనుగొన్నారు. మామూలుగా విమానం టేకాఫ్ సమయంలో తుపాకీలు పేల్చడం, విషప్రయోగం చేయడం వంటి పనులతో పక్షులను చెల్లాచెదురు చేస్తుంటారు. వీటి వల్ల భారీ సంఖ్యలో పక్షులు మృతి చెందుతుంటాయి. దీంతో, ఓహియోలోని డేటన్ ఎయిర్ పోర్టు అధికారవర్గాలు ప్రయరీ గడ్డి పెంచాలని భావిస్తున్నాయి. ప్రయరీ గడ్డి ఏపుగా ఎదుగుతుంది. ఈ గడ్డిని చూసిన పక్షులు అందులో క్రూర మృగాలేవైనా ఉంటాయేమోనని భయపడతాయని, తద్వారా ఆ పరిసరాల్లోకి రావడం మానేస్తాయన్నది వారి ప్లాన్. ఈ ఏడాది చివరినాటికి సదరు గడ్డిని నాటాలని ఎయిర్ పోర్టు వర్గాలు నిశ్చయించుకున్నాయి. కాగా, ప్రతి ఏడాది అమెరికాలో పక్షులు విమానాలను ఢీకొంటున్న సంఘటనలు 10 వేల దాకా నమోదవుతున్నాయట. అయితే, ఇంజిన్ కు కాకుండా ఇతర భాగాలకు తగిలితే పెద్దగా నష్టం ఉండదని, పక్షి శరీర భాగాలు ఇంజిన్ లో చిక్కుకుపోతే మాత్రం నష్టం తీవ్రంగా ఉంటుందని వైమానిక నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News