: తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ఉండగా... విజయవాడ ఎందుకు?: బొత్స


ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ఉండగా... మళ్లీ విజయవాడ ఎందుకని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లాభం చేకూర్చేందుకే విజయవాడను తాత్కాలికంగా రాజధానిని చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అఖిలపక్షం నిర్వహించకుండా... చంద్రబాబు సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ త్వరలో చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

  • Loading...

More Telugu News