: జయప్రద భద్రతపై అమర్ సింగ్ ఆందోళన
రాంపూర్ ఎంపీ జయప్రద భద్రత పట్ల సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఆయన నేడు ఓ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఇటీవలే యూపీలో జయపద్ర పట్ల అక్కడి రవాణా శాఖతో పాటు పోలీసు అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, ఆమె కారుపై ఎర్రలైటు తొలగించారని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పక్షపాతానికి తావులేని రీతిలో విచారణ జరిపించాలని కూడా అమర్ సింగ్ విన్నవించారు.