: లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా తంబిదురై ఎన్నిక


లోక్ సభ ఉపసభాపతిగా అన్నాడీఎంకె సీనియర్ నాయకుడు తంబిదురై ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన తంబిదురైకు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తంబిదురై డిఫ్యూటీ స్పీకర్ గా ఎన్నికవడం ఇది రెండోసారి. గతంలో 1985-89 సంవత్సరాల మధ్య కాలంలో రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అలాగే 1998 -99 సంవత్సరంలో కేంద్ర ఉపరితల రవాణా,న్యాయశాఖ మంత్రి కూడా పనిచేశారు. యూపీఏ హయాంలో ప్రొటెం స్పీకర్‌గా కూడా ఆయన వ్యవహరించారు.

  • Loading...

More Telugu News