: ఉభయరాష్ట్రాల్లో పెళ్ళి సందడి... శ్రావణమాసం ఎఫెక్ట్
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతోంది. ఈ నెల 13, 14, 15, 16, 20 తేదీల్లో దివ్యమైన ముహుర్తాలుండడంతో పురోహితులు, డెకరేటర్లకు యమ డిమాండ్ ఏర్పడింది. ఫంక్షన్ హాళ్ళు దొరకడంలేదట. దాదాపు అన్నీ ముందుగానే బుక్ అయిపోవడంతో కొందరు నిరాశ చెందుతున్నారు. ఇక, ఎప్పటిలానే తిరుమలలో వేలాదిగా వివాహాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.