: ఏ చానల్ చూడాలన్న దానిపై తండ్రీకూతుళ్ల తగాదా, మధ్యలో వచ్చిన అల్లుడికి కత్తిపోట్లు


మానవ సంబంధాలను కంప్యూటర్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు శాసిస్తున్నాయి. వీటి మాయలో పడి మనిషి ఒక్కోసారి తనకున్న విచక్షణను, ఆలోచనను, వివేచనను కూడా కోల్పోతున్నాడు. దీనికి ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు మన చుట్టూ ఉన్న సమాజంలో నిత్యం జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి నిన్న హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ శారదానగర్ లో మైఖేల్ అనే 60 ఏళ్ల వ్యక్తి తన కూతురు, అల్లుడితో కలిసి నివాసముంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం మైఖేల్... కూతురు మరియా థెరిస్సా టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలోనే, వారిద్దరి నడుమ ఏ చానల్ చూడాలన్న విషయమై తగాదా వచ్చింది. తండ్రీకూతుళ్ల మధ్య గొడవ పెద్దదవుతుండడంతో, అల్లుడు సత్యశ్రీనివాస్ కలుగజేసుకుని వారించబోయాడు. దీంతో ఆగ్రహించిన మైఖేల్ వంట గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో తన సొంత అల్లుడి మీద దాడి చేశాడు. ఈ సంఘటనలో సత్యశ్రీనివాస్ కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

  • Loading...

More Telugu News