: తెలంగాణకు చైనా 'పవర్'!
కరెంటు కష్టాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణ రాష్ట్రానికి చైనా సంస్థ డాంగ్ ఫాండ్ ఎలక్ట్రిక్ కంపెనీ (డీఈసీ) ఓ ప్రతిపాదన చేసింది. చైనా నుంచి వచ్చిన డీఈసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ను కలిసి చర్చించింది. 660-1000 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రపంచస్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాలను అతి తక్కువ సమయంలోనే నిర్మించి ఇస్తామని డీఈసీ ప్రతినిధులు కేసీఆర్ తో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను పరస్పర ఆమోదయోగ్యమైన షరతులు, నిబంధనలకు లోబడే ఏర్పాటు చేసుకుందామని వారు కేసీఆర్ కు సూచించారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ కు చెందిన డీఈసీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ పరికరాల తయారీదారుగా పేరుగాంచింది.