: 'భారతరత్న'కు ధ్యాన్ చంద్ పేరు సిఫారసుపై మిల్కాసింగ్ హర్షం


హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును ప్రతిష్ఠాత్మక భారతరత్న పురస్కారానికి సిఫారసు చేయడంపై పరుగుల వీరుడు మిల్కాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం వినగానే తానెంతో ఆనందించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అసలు ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడిగా ధ్యాన్ చంద్ పేరు ఉండాల్సిందని మిల్కా అన్నారు. కనీసం ఇప్పుడైనా ఆయన సేవలు గుర్తించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. హాకీలో తన అసమాన ప్రతిభతో ధ్యాన్ చంద్ దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చాడని ఈ 'ఫ్లయింగ్ సిఖ్' కొనియాడారు.

  • Loading...

More Telugu News