: మనమ్మాయిలకు నేటి నుంచి 'టెస్టు'


ఓవైపు పురుషుల జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తుండగానే, భారత మహిళల జట్టు కూడా తన టూర్ ఆరంభించింది. మనమ్మాయిలు ఇంగ్లండ్ మహిళల జట్టుతో నేటి నుంచి టెస్టు ఆడనున్నారు. కాగా, ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళల జట్టు టెస్టు ఆడడం ఇదే ప్రథమం. 2006లో ఇంగ్లండ్ లో పర్యటించిన భారత అమ్మాయిలు అప్పుడు జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 1-0తో చేజిక్కించుకోవడం విశేషం. ప్రస్తుత జట్టులో ఎక్కువగా కొత్తముఖాలకు చోటు కల్పించారు. మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి, కారూ జైన్ లకు మాత్రమే టెస్టు క్రికెట్ అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇంగ్లండ్ పర్యటన కాస్త క్లిష్టంగానే ఉండొచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News