: 'మీరు సీలేరు నుంచి ఇవ్వకపోతే... మేం సాగర్ నుంచి ఇవ్వం': ముదురుతున్న'పవర్'వార్:


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'పవర్' వార్ ముదురుతోంది. వాస్తవానికి పీపీఏలను ఏపీ సర్కార్ రద్దు చేసుకున్నప్పటికీ... రాష్ట్ర విభజనకు ముందున్న పద్ధతిలోనే కరెంట్ పంపకాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు జరుగుతున్నాయి. కొత్తగా లోయర్ సీలేరు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 390 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. అయితే, ఇటీవల సీలేరు కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు ఏపీ సర్కార్ నిరాకరించింది. దీనికి కౌంటర్ గా నాగార్జున సాగర్ నుంచి ఉత్పత్తి అవుతున్న 700 మెగా వాట్ల విద్యుత్ ను తామే వాడుకుంటామని... ఏపీకి దీనిలో వాటా ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News