: అశ్విన్ కు అర్జున అవార్డు


భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (27) ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు ఈ గౌరవం దక్కించుకున్న క్రికెటర్లలో అశ్విన్ 46వ వాడు. అశ్విన్ తాజాగా ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో నెంబర్ వన్ పీఠం అధిష్ఠించడం తెలిసిందే. ఈ తమిళతంబి ఇప్పటివరకు 20 టెస్టులు, 79 వన్డేలు, 25 టి-ట్వంటీ మ్యాచ్ లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. అర్జున అవార్డు అందుకున్న క్రికెటర్లలో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్, హర్భజన్, కోహ్లీ తదితరులున్నారు.

  • Loading...

More Telugu News