: నేడు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
లోక్ సభకు నేడు డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ఈ పదవికి అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై ఎన్నిక కావడం లాంఛనమే అని తెలుస్తోంది. కాగా, సీనియర్ నేత తంబిదురై ఈ పదవిని అధిష్ఠించనుండడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆయన 1985లో ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. కాగా, కరూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తమిళ'తంబి' ఐదు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికవడం విశేషం.