: సీబీఐకి సుప్రీం ఝలక్!


కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. 2జీ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను తమకు సమర్పించాలని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ డీఐజీ సంతోష్ రస్తోగీని బదిలీ చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీ చేసిన రస్తోగీని తక్షణమే తిరిగి అదే విధుల్లో నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును తొలినుంచి దర్యాప్తు చేస్తున్న రస్తోగీని ఉన్నపళంగా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్వాన్-రిలయన్స్ కేసులో ముగింపు దశకు వచ్చిన విచారణను నిలిపివేయాలని, ఈ విషయంలో కొన్ని అంశాలను మార్చాల్సి ఉందని చెబుతూ సీబీఐ డైరెక్టర్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. కేసు విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలో మార్పుచేర్పులంటారేమిటని ధ్వజమెత్తింది. కేసును నీరుగార్చేందుకు సీబీఐ ఈ తరహా చర్యలకు పాల్పడుతోందన్న ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.

  • Loading...

More Telugu News