: రియల్ ఎస్టేట్ కి లబ్ది చేకూర్చేందుకే రాజధాని ప్రకటన: రాఘవులు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై రోజుకో ప్రకటన చేయడంపై సీపీఎం నేత రాఘవులు అసహనం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తున్నారని అన్నారు. పూర్తిగా వెనుకబడిన రాయలసీమను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాయలసీమ ప్రాంతానికి విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాఘవులు డిమాండ్ చేశారు.