: ఆస్కార్ పురస్కారం అందుకుంటూ కూడా నవ్వించాడు!
అనుమానాస్పద స్థితిలో మరణించిన హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ 1998లో 'గుడ్ విల్ హంటింగ్' సినిమాలో వేసిన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అవార్డు తీసుకునేటప్పుడు తనదైన శైలిలో రెండు ముక్కలు మాట్లాడి అందర్నీ నవ్వించారు. ఆ రోజు రాబిన్ విలియమ్స్ మాట్లాడుతూ... "నేను నటుడిని అవ్వాలనుకుంటున్నానని మా నాన్నతో చెబితే... ఆయన వెరీ గుడ్ అలాగే కానీయ్... అయితే ఎందుకైనా మంచిది, వెల్డింగ్ కూడా నేర్చుకో అని సలహా ఇచ్చాడు" అని చెప్పగానే ఆస్కార్ హాలు మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. రాబిన్ విలియమ్స్ పిల్లలకు ఇష్టమైన నటుడు.