: శ్రీశైలం డ్యాం నిండుతోంది
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో ఇన్ ఫ్లో లక్షా 18 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 57 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 881 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 193.4 టీఎంసీలు ఉంది.