: రెండు తలల డాల్ఫిన్ ను ఎప్పుడైనా చూశారా?


రెండు తలల డాల్ఫిన్ ను ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? లేదు కదా! టర్కీలోని ఇజ్ మిర్ సముద్రతీరంలోని డికిలి బీచ్ లో రెండు తలల డాల్ఫిన్ కనువిందు చేసింది. సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఈ రెండు తలల డాల్ఫిన్ లోపలికి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేసింది. అయినా పొట్ట నేలకు అంటుకుపోవడంతో వెనుదిరగలేకపోయింది. దీంతో కాసేపటికే మృతిచెందింది. సయామీ ట్విన్స్ గా జంతు శాస్త్రవేత్తలు ఈ డాల్ఫిన్స్ ని గుర్తించారు. మనుషుల్లాగే జంతువుల్లో కూడా ఇలాంటి అరుదైన చేపలు పుడుతూ ఉండవచ్చని వారు పేర్కొన్నారు. దీనిని మ్యూజియంలో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News