: ఆయుధాలు రష్యా నుంచి కాదు...అమెరికా నుంచే
భారత్- రష్యాల మధ్య బంధం బలమైనది. రష్యా మిత్రదేశంగా ఉన్న భారత్ అమెరికాకి వ్యూహాత్మక మిత్రదేశం అని విశ్లేషకులు పలు సందర్భాల్లో వెల్లడిస్తుంటారు. అలాగే, భారతదేశం ఆయుధాలను రష్యా నుంచే సమకూర్చుకుంటుందని పలు సందర్భాల్లో పేర్కొంటుంటారు. అది వాస్తవం కాదని గత మూడేళ్లలో అమెరికా నుంచే భారత్ ఆయుధ సంపత్తి పెంచుకుంటోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గత మూడేళ్లలో విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు 83,458 కోట్ల రూపాయలను వెచ్చించగా, అమెరికా నుంచి 32,615 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేసిందని తెలిపారు. రష్యా నుంచి 25,363 కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు.