: లాభాల బాట పట్టిన వెండి, బంగారం
వెండి, బంగారం లాభాల బాట పట్టాయి. రెండు రోజులుగా నష్టాలను చవి చూసిన వెండి, బంగారం ఇవాళ (మంగళవారం) లాభాలతో ముగిశాయి. మంగళవారం నాడు మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.28,750 ఉండగా, కిలో వెండి ధర రూ.44,275 ఉంది. బంగారం 25 రూపాయలు, వెండి 275 రూపాయలు పెరిగి లాభాలతో ముగిశాయి. పండుగ సీజన్ కావడంతో బంగారం వ్యాపారులు కొనుగోళ్లు జరపడంతో లాభాలను నమోదు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.