: అక్రమ సంబంధమే యాసిడ్ దాడికి పురికొల్పిందా?
కర్నూలు జిల్లా చాగలమర్రిలో లాల్ పాషా అనే యువకుడు ఓ వివాహితపై యాసిడ్ తో దాడి చేశాడు. బాధితురాలు అతడ్ని అడ్డుకోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు పాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పాషాను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే యాసిడ్ దాడికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. పాషాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.