: చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట వరకు... ఎక్కడి వాహనాలు అక్కడే
హైదరాబాదులోని చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఒక వైపు మెట్రో పనులు జరుగుతుండగా, మరోవైపు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.