: దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటాం: రాజ్ నాథ్ సింగ్


అంతర్జాతీయ నేరస్తుడు దావూద్ ఇబ్రహీంను అరెస్టు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ లో తలదాచుకున్నట్టు భావిస్తున్న దావూద్ ఇబ్రహీంను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. యూపీఏ ప్రభుత్వం కూడా దావూద్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు చేసినట్టే తాము కూడా దావూద్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News