: పెట్రోల్ ధర తగ్గే అవకాశం
దేశంలో పెట్రోల్ ధర తగ్గే అవకాశం ఉంది. లీటరుపై రూ.2.40 పైసలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు రేట్లు క్షీణిస్తున్న నేపథ్యంలో ధర తగ్గించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ సమీక్షా సమావేశంలో నిర్ణయించాయి. దాంతో, పెట్రోల్ రేటును ఇలా వరుసగా మూడోసారి తగ్గించారని, ఈ నెల ఒకటవ తేదీన రూ.1.09 పైసలు తగ్గించారని అంటున్నారు.