: పీవీ సింధుకి విద్యార్థుల ఘనసన్మానం
కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి ఘన సన్మానం జరిగింది. హైదరాబాదులోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో సింధు బీకాం తృతీయ సంవత్సరం చదువుతోంది. మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు ఈ సన్మానం చేశారు. ప్రిన్సిపాల్ ఆంథోనమ్మ సింధుకి శాలువా కప్పి, ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా సింధును కలిసి పలువురు విద్యార్థులు అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన సింధు తమ కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.