: పూటుగా మందు తాగేసి చిందులేసిన టీచర్లు
దేవాలయం లాంటి విద్యాలయంలో అపచారం జరిగింది. ఆదర్శంగా ఉంటూ విద్యార్థులను దారిన పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. కరీంనగర్ జిల్లా దంగర్ వాడి స్కూల్ లోని ఏడుగురు ఉపాధ్యాయులు పార్టీ చేసుకున్నారు. స్కూల్ లోనే పూటుగా మందు తాగేసి చిందులేశారు. మద్యం మత్తులో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. వీరి వేషాలు చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఏడుగురు ఉపాధ్యాయులతో పాటు మరో నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. దీంతో స్పందించిన డీఈవో ఏడుగుర్నీ సస్పెండ్ చేశారు.