: 'ధోతి బిల్లు'కు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం


పంచెకట్టుకు చట్టబద్ధత కల్పిస్తూ ముఖ్యమంత్రి జయలలిత తీసుకొచ్చిన 'ధోతి బిల్లు'కు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అన్ని పార్టీల సభ్యుల అంగీకారంతో ఈ బిల్లు పాస్ అయింది. దాంతో, ఆ రాష్ట్రంలోని క్లబ్బులు, పలు కంపెనీలు ఇలా అన్ని చోట్ల ఎవరైనా పంచెకట్టుతో వెళ్లవచ్చు. తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచెకట్టుతో వచ్చిన వారిని ఎవరూ తిరస్కరించేందుకు వీలులేదు. ఒకవేళ తిరస్కరిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఏడాది జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తుంది.

  • Loading...

More Telugu News