: సాఫ్ట్ వేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి: కేటీఆర్
హైదరాబాదు నగరంలో సాఫ్ట్ వేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని, ఐటీ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో హైదరాబాదు నగరాన్ని మోస్ట్ ఎఫిషియంట్ సిటీగా మారుస్తామని మంత్రి పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీ పర్వేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన విస్తరణ విభాగాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్వేషియా ఇండియా సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో సంజయ్ కనౌడియా, ఇండియా విభాగం డైరెక్టర్ సీమ కనౌడియా, ఐటీ విభాగం డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఇంజనీరింగ్ మేనేజర్ శివకాంత్, విదేశీ ప్రతినిధులు ఆండ్రూ, బ్రిజేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.