: కేంద్రంతో కయ్యానికైనా సిద్ధం: నాయిని
గవర్నరుకు ప్రత్యేక అధికారాలపై కేంద్రంతో కయ్యానికైనా సిద్ధమని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారాలను ఎవరూ బలవంతంగా తీసుకోలేరని స్పష్టం చేశారు. కేంద్రం వెనక్కి తగ్గకుంటే ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తెలంగాణ ఎంపీలు రాజీనామాలు చేసేందుకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ నెల 18న రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అవుతారని ఆయన వెల్లడించారు.