: తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి


ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమే అమలు చేస్తారో, ఫాస్ట్ పథకమే అమలు చేస్తారో మీ ఇష్టం... కానీ అడ్మిషన్ రోజునే ఫీజులు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి రమేష్ తేల్చి చెప్పారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 31లోపు పాత బకాయిలన్నీ చెల్లించాలని ఆయన డెడ్ లైన్ విధించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో పథకమేదైనా పాత విధానాలే ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఫాస్ట్ కమిటీ సంధిస్తున్న ప్రశ్నలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాలేజీలు వ్యాపారం కోసం పెట్టుకున్నారా? అని ఫాస్ట్ కమిటీ అడుగుతోందని తాము ప్రభుత్వ చేయూతతో కళాశాలలు ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తమ డబ్బుతోనే జేఎన్టీయూ, ఎంసెట్ ఆఫీసులు నడుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. తాము ఫీజులు చెల్లించకపోతే, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులను మాత్రమే లెక్కిస్తే ప్రభుత్వ విద్యాలయాలు ఎందుకూ కొరగాకుండా పోతాయని ఆయన సూచించారు. ర్యాంకులు కూడా ప్రైవేటు కళాశాలలకే వస్తాయన్న విషయాలను విస్మరించరాదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News