: క్రికెట్లో కొత్త బ్యాట్ వస్తోంది... ఎడ్జ్ తీసుకున్నా బంతి క్యారీ కాదట!


ఉవ్వెత్తున ఎగసి, లైట్ గా స్వింగ్ అయిన బంతిని ఆడే క్రమంలో బ్యాట్స్ మెన్ స్లిప్స్ లోనో, వికెట్ కీపర్ కో క్యాచ్ ఇవ్వడం ఎన్నో మ్యాచ్ లలో చూశాం. డెలివరీని తప్పుగా అంచనా వేస్తే, బంతి కాస్తా సుతారంగా బ్యాట్ అంచులను రాసుకుంటూ వెళుతుంది. అది ఫీల్డర్ల చేతిలో పడితే ఆ బ్యాట్స్ మన్ పెవిలియన్ చేరకతప్పదు. అయితే, ఇద్దరు ముంబయి ఐఐటీ గ్రాడ్యుయేట్లు రూపొందించిన కొత్త తరం బ్యాటు ఎడ్జ్ లు తీసుకున్నా బంతి క్యారీ కాదట. పైగా, తేలిగ్గా ఉండి, వేగంగా ఝుళిపించేందుకు వీలవుతుందట. దీనికి వారు 'ఫాల్కన్ బ్లేడ్- ద కట్టింగ్-ఎడ్జ్ విల్లో' అని నామకరణం చేశారు. సౌతాంప్టన్ టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ స్లిప్స్ లో దొరికిపోవడాన్ని గమనించిన ఈ విద్యార్థులు తాజా బ్యాట్ కు రూపకల్పన చేశారు. తమ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నా, అది క్యారీ అవదని చెబుతున్నారు. కాగా, ఈ బ్యాట్ కు ప్రతిష్ఠాత్మక ఎంసీసీ ఆమోదం లభించడం విశేషం.

  • Loading...

More Telugu News