: 'ఇందిరా ఆవాస్ యోజన' పేరు మార్చే యోచన!
ఇందిరా ఆవాస్ యోజన (ఐఎవై) పేరును మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 'జాతీయ గ్రామీణ్ అవాస మిషన్' (గ్రామ్) గా కేంద్రం మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. త్వరలో ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు, లక్ష్యాలను సవరించనున్నారు. దాంతో పాటే పేరునూ మార్చబోతున్నారట. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించే అవకాశముందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఐఎవై పేరును మారుస్తూ ఒక్కో ఇంటిపై చేసే ఖర్చును రూ.1.50 లక్షలకు పెంచబోతున్నట్లు తెలిపాయి. 1985లో ఐఎవైను అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రారంభించింది.