: మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాఘవేంద్రస్వామి మూల బృందావనంలో ప్రవేశించిన రోజు కావడంతో మధ్యారాధన ఉత్సవాలు శ్రీమఠంలో వైభవంగా నిర్వహించారు. టీటీడీ జేఈవో శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రాకారంలో బంగారు రథంపై స్వామివారిని ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రాఘవేంద్రస్వామి మఠం కిటకిటలాడింది. స్వామివారి 343వ ఆరాధనోత్సవాలు మఠంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరాధనోత్సవాల్లో భక్తులు ఆనందంతో చేసిన నృత్యం ఆకట్టుకుంది.