: భారతరత్న పురస్కారానికి ధ్యాన్ చంద్ పేరు సిఫారసు


దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుకు హాకీ మాంత్రికుడు దివంగత ధ్యాన్ చంద్ పేరును సిఫారసు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖలు అందాయి. ఈ మేరకు హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఈరోజు (మంగళవారం) లోక్ సభలో వెల్లడించారు. ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేస్తూ క్రీడాశాఖ మంత్రిత్వ శాఖ, పలువురు హోంశాఖకు లేఖలు పంపారని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. 1928-36 మధ్య ధ్యాన్ చంద్ ఒలింపిక్స్ లో దేశానికి మూడు బంగారు పతకాలు సాధించి పెట్టారు. కాగా, ఇప్పటికే ప్రధానంగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్, సుభాష్ చంద్రబోస్ ఈ ఏడాది భారతరత్న అవార్డు పరిశీలనలో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ధ్యాన్ చంద్ కూడా చేరనున్నారు.

  • Loading...

More Telugu News