: మోడీపై విమర్శలు గుప్పించిన సోనియా
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు ఎక్కువయ్యాయని... రెండు నెలల్లోనే 600 మత హింస ఘటనలు జరిగాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలను చీలుస్తోందని సోనియా ఆరోపించారు. విద్రోహ శక్తులను ఎదుర్కోవడానికి అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.